విలన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలి కాలంలో వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ‘జబర్దస్త్’ షోతో మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకున్న నాగబాబు.. ఆ షోను వదిలేసిన అనంతరం బుల్లితెరపై కాసింత గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ‘జబర్దస్త్’ నుంచి ‘అదిరింది’కి వెళ్లిన ఆయన.. ఆ షోని నిలబెట్టడంలో విఫలమయ్యారు. దీంతో నిర్వాహకులు ఆ షోని నిలిపివేశారు. ప్రస్తుతానికి ఆయన బుల్లితెరకు విరామమిచ్చారు. దీంతో మరోసారి సినిమాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అది కూడా ఆశ్చర్యకరంగా బాలీవుడ్‌కి.
మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ప్రభాస్ చిత్రం ‘ఛత్రపతి’ మూవీని యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగబాబు విలన్ పాత్ర పొషిస్తున్నట్లు ఆయన తాజా ఫొటో షూట్ చూస్తే తెలుస్తోంది. ఈ ఫొటోలో నాగబాబు నోటిలో సిగరేట్‌తో.. మొహంపై గాటుతో విలన్ గేటప్‌లో దర్శనమిచ్చారు. అది చూసి అందరూ షాకై ఆరా తీయగా ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. హిందీలో రిమేక్ కానున్న ఛత్రపతి మూవీలో నాగబాబు విలన్‌గా నటిస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
హిందీ ‘ఛత్రపతి’లో విలన్ పాత్ర కోసం ఈ చిత్ర యూనిట్.. నాగబాబును సంప్రదించిందని.. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకూ నాగబాబు పూర్తి స్థాయి విలన్ పాత్రను చేయలేదు. ప్రస్తుతానికి ఆయన బాగా తగ్గిపోయారు. దీంతో ఆయన విలన్ గెటప్‌కు బాగా సూట్ అవుతారనే అనిపిస్తోంది. ఈ అవకాశం ఓకే అయితే ఇక వెండితెరపై మరో విలన్ సిద్ధమైపోయినట్టేనని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com