నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య. కొత్తదనం నిండిన కథలతో యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారాయన. గతేడాది వరుడు కావలెను సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లక్ష్యతో సైతం నాగశౌర్య మెప్పించారు. ఈ క్రమంలో ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘‘కృష్ణ వ్రింద విహారీ’’ . నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాతో షిర్లే సేతియా హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదతరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ఈ సినిమా.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారయ్యింది. ఏప్రిల్ 22 న ‘‘కృష్ణ వ్రింద విహారీ’’ని విడుదల చేస్తున్నట్టు ఈ రోజు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక దర్శకుడు అనీశ్ విషయానికి వస్తే.. ఆయన గతంలో 'అలా ఎలా?' 'లవర్', 'గాలి సంపత్' సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘‘కృష్ణ వ్రింద విహారీ’’ నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు చూస్తుంటే యూత్, కుటుంబ ప్రేక్షకులను టార్గెట్‌గా చేసుకుని సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మరి నాగశౌర్య మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటూ ఏప్రిల్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com