కలిసొచ్చిన సంగీత దర్శకుడితో నాగశౌర్య వరుస చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
''చూసి చూడంగానే నచ్చేశావే.. అడిగి అడంగానే వచ్చేశావే.. నా గుండెల్లోకి..'' అంటూ సాగే 'ఛలో' చిత్రంలోని పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటే కాదు సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా కథానాయకుడిగా నాగశౌర్యకి, సంగీత దర్శకుడిగా మహతి స్వర సాగర్‌కు ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
ఈ సినిమా కంటే ముందు.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'జాదుగాడు' వచ్చినా.. వర్కవుట్ కాలేదు. ఛలో అందించిన సక్సెస్‌తో.. సెంటిమెంట్‌తో హీరో నాగశౌర్య ..మహతితోనే వరుస సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తన సొంత సంస్థ నిర్మిస్తున్న '@నర్తనశాల'తో పాటు తాజాగా ప్రారంభమైన భవ్య క్రియేషన్స్ వారి చిత్రం కోసం కూడా మహతితో కలిసి పనిచేస్తున్నాడు నాగశౌర్య. ఛలో మ్యాజిక్ ఈ రెండు సినిమాలకు కూడా కొనసాగితే.. ఈ కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com