ముద్దులు వద్దంటున్న శౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
నాగశౌర్య చాలా సెంటిమెంట్‌గా ఫీలవుతున్నాడు. ప్రతి చిన్నవిషయాన్ని ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకుసాగుతున్నాడు. 2016లో నాగశౌర్యకు ఐదు విడుదలలు ఉన్నాయట. వాటి గురించి నాగశౌర్య చెబుతూ ``నేను 2016లో ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాను.
అందులో మొదటిది అబ్బాయితో అమ్మాయి. రెండో చిత్రం కల్యాణ వైభోగమే. మూడో సినిమా ఒక మనసు. నాలుగో సినిమా జో అచ్యుతానంద, ఐదో చిత్రం కౌటిల్య. ఈ సినిమాలు వేటిలోనూ శౌర్య లిప్‌లాక్ చేయడటం లేదట. జాదూగాడులో లిప్‌లాక్ చేస్తే తనకు కలిసి రాలేదట. ప్రేక్షకులు తనను ఇంకా ఫ్యాఇలీ హీరోగానే చూడాలని భావిస్తున్నట్టు తనకు అర్థమైందని చెప్పాడు. సో ఇక ముద్దు సీన్లు, మాస్ సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంటానంటున్నాడు నాగశౌర్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout