కణం వాయిదా పడిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిదా చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మలర్ బ్యూటీ సాయిపల్లవి.. గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఎంసీఏ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాల విజయాలతో సాయిపల్లవికి టాలీవుడ్‌లో మరింత డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఈ రెండు చిత్రాల తరువాత సాయిపల్లవి నుంచి రాబోతున్న సినిమా కణం.
తమిళంలో కరు పేరుతో.. తెలుగులో కణం పేరుతో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడిందని తెలిసింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. నాలుగేళ్ళ చిన్నారికి తల్లిగా సాయిపల్లవి చేసిన నటన సినిమాకి హైలైట్ కానుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com