రొమాంటిక్ స్టిల్‌లో నాగశౌర్య...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ తరహా పాత్రల్లో మాత్రమే కనిపించి మెప్పించిన నాగశౌర్య ఈ సారి మాత్రం ఓ సీరియస్ రోల్ కోసం మరింత సీరియస్‌గా వర్కవుట్ చేసి మరీ రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్చరీ నేపథ్యంలో తెరెకెక్కుతున్న `లక్ష్య` సినిమాలో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తాజాగా ఈ సినిమా యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. హీరోయిన్ కేతికా శర్మతో నాగశౌర్య రొమాంటిక్ స్టిల్‌ను చిత్రబృందం వదిలింది. ఈ స్టిల్‌ను చూస్తుంటే నాగశౌర్య ఏజ్ కూడా కొన్ని ఏళ్లు తగ్గినట్టు కనిపిస్తోంది. క్లీన్ షేవ్‌తో లవర్ బాయ్‌గా కనిపిస్తున్నాడు. కేతికా శర్మ కూడా చాలా అందంగా కనిపిస్తోంది. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సిక్స్ ప్యాక్ బాడీతో మంచి ఫిట్నెస్తో నాగశౌర్య కనిపించాడు. సంతోష్ జాగర్లమూడి రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com