ఎంబీఏ స్టూడెంట్ గా నాగశౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
'ఛలో'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. అతి త్వరలో అమ్మమ్మగారి ఇల్లు`తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'ఓయ్'తో కథానాయికగా పరిచయమైన ఒకప్పటి బాలనటి షామిలి.. ఈ చిత్రంతో తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ద్వారా సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం కానున్నాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇటీవల ప్రేమికుల రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా వుంటే.. చాలా సంవత్సరాల విరామం అనంతరం తెలుగులో నటిస్తున్న షామిలి ఈ సినిమాలో సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపించనుండగా.. నాగ శౌర్య ఎం.బి.ఎ.స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. స్వాజిత్ మూవీస్ పతాకంపై శ్రీమతి స్వప్న సమర్పిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్ర బృందం. ఈ చిత్రంతోనైనా షామిలికి మంచి విజయం లభిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments