మరో సినిమాను ఖరారు చేసిన నాగశౌర్య

  • IndiaGlitz, [Friday,October 16 2020]

యువ కథానాయకుడు నాగశౌర్య వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. శుక్రవారం రోజున తన కొత్త చిత్రాన్ని నాగశౌర్య అనౌన్స్‌ చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా చేయనున్నట్లు నాగశౌర్య తెలిపారు. అలా ఎలా, లవర్స్‌ చిత్రాల దర్శకుడు అనీల్‌ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర తారాగణం వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. నాగశౌర్య హీరోగా, నిర్మాతగా ఇప్పటి వరకు మూడు సినిమాలను రూపొందించారు. తొలి చిత్రం 'ఛలో' మంచి సక్సెస్‌ను సాధించగా, రెండో చిత్రం 'నర్తనశాల' డిజాస్టర్‌ అయ్యింది. మూడో చిత్రంగా విడుదలైన 'అశ్వథ్థామ' సో సోగానే ఆడింది. ఇప్పుడు నాలుగో సినిమాతో మంచి హిట్‌ సాధించాలని నాగశౌర్య ప్లాన్స్‌ చేస్తున్నారు. సాగర్‌ మహతి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే తన 20వ చిత్రంగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ నెల 19 నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

More News

'మోసగాళ్లు'కు వెంకీ వాయిస్‌ ఓవర్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్లు’.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు..

ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

కూకట్‌పల్లిలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం, ప్రేమ ముసుగులో యువతిని బర్త్ డే పార్టీకి రప్పించి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

మెగాస్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అవినాష్‌కి మోనాల్ టిఫిన్ తినిపిస్తుంటే... అమ్మ రాజశేఖర్ సెటైర్లు చాలా ఫన్నీగా అనిపించాయి.

బార్క్ కీలక నిర్ణయం.. 12 వారాల పాటు రేటింగ్స్ నిలిపివేత..

బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. వీవర్ షిప్ ఆధారంగా టెలివిజన్ ఛానెల్స్‌కు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ఏకంగా 12 వారాలపాటు