ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉండే డిఫరెంట్ లవ్ స్టోరీ అబ్బాయితో అమ్మాయి - హీరో నాగ శౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ శౌర్య నటించిన తాజా చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ తెరకెక్కించారు. విభిన్న కథాంశంతో రూపొందిన అబ్బాయితో అమ్మాయి చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అబ్బాయితో అమ్మాయి సినిమా గురించి యువ హీరో నాగ శౌర్యతో ఇంటర్ వ్యూ మీకోసం....
అబ్బాయితో అమ్మాయి కాన్సెప్ట్ ఏమిటి...?
ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా. డిఫరెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే...ప్రతి ఒక్కరి లవ్ స్టోరి డిఫరెంటే. మనసులు వేరు..మనుషులు వేరు. ఈ సినిమాలో ఫేస్ బుక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయి అబ్బాయి ఎలా ఇంట్రాక్ట్ అయ్యారు.? అలాగే ఫేస్ బుక్ ని మిస్ యూజ్ చేస్తే ఇద్దరి లైఫ్ లో ఏం జరిగింది..? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది.
ఫేస్ బుక్ కాన్సెప్ట్ తో గతంలో సినిమాలు వచ్చాయి. మరి ఇందులో ఉన్న కొత్తదనం ఏమిటి..?
ఫేస్ బుక్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు నాకైతే పెద్దగా గుర్తు లేవు. దీనిలో ఫేస్ బుక్ అలా వచ్చి...ఇలా వెళ్లిపోతుంది. అంతే కానీ...మొత్తం సినిమా అంతా ఫేస్ బుక్ గురించే ఉండదు.ఇది ఫ్యామిలీ లవ్ స్టోరి. కొడుకు లవ్ కి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాం.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ పేరు అభి. చాలా సరదాగా ఉండే కుర్రాడుగా కనిపిస్తాను. పేరెంట్స్ మా కొడుకు అభిలా ఉంటే చాలు అనుకునేలా నా పాత్ర ఉంటుంది.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు అభి. మన్మధుడు సినిమాలో మీ ఫేవరేట్ హీరో నాగార్జున గారి పేరు కూడా అభి. కావాలనే పెట్టారా..?
కావాలని పెట్టలేదు. కానీ నా ఫేవరేట్ హీరో నాగార్జున గారి మన్మధుడు సినిమాలో క్యారెక్టర్ పేరే నా క్యారెక్టర్ కి పెట్టడం హ్యాపీగా ఫీలవుతున్నాను.
ఈ సినిమాని నాగార్జున గార్కి చూపిస్తారా..?
ఈ సినిమా అనే కాదండీ. నేను నటించిన ప్రతీ సినిమా నాగార్జున గార్కి చూపించాలని ఉంటుంది. కానీ నాగార్జున గారు షూటింగ్ లో బిజీ. టైం కుదిరితే తప్పకుండా నా సినిమా చూపిస్తా.
హీరోయిన్ పల్లక్ లల్వాని గురించి..?
హీరోయిన్ పల్లక్ లల్వాని కొత్త అమ్మాయి. ఫస్ట్ 25 రోజులు నా పైనే సీన్స్ తీసారు. ఆతర్వాత పల్లక్ లల్వాని జాయిన్ అయ్యింది. అయితే డైరెక్టర్ రమేష్ వర్మని అడిగాను...కొత్త అమ్మాయి అంటున్నారు...ఏక్టింగ్ లో ట్రైనింగ్ ఏమైనా తీసుకుందా అని..? ఆయన అదేమి లేదు..లుక్స్ బాగాన్నాయని హీరోయిన్ గా ఫైనల్ చేసానని చెప్పారు. దీంతో అమ్మాయి ఎలా చేస్తుందో...అనే డౌట్ ఉంది. ఎందుకంటే లవ్ స్టోరిలో అమ్మాయి ఇంపార్టెంట్. తను బాగా చేయకపోతే మూవీ బాగా రాదు. అయితే తనతో నటించిన తర్వాత తెలిసింది.ఆమె చాలా మంచి నటి అని.
మీ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ అందించారు కదా..? ఎలా ఫీలయ్యారు...?
ఇళయరాజా గారు గురించి ఎంత చెప్పినా తక్కువే.దాదాపు ఐదు వేల పాటలు అందించారు. ఇళయరాజా గారి 999 వ సినిమా నా సినిమా కావడం...అలాగే ఇప్పుడే కెరీర్ ప్రారంభించిన నాలాంటి హీరో సినిమాకి ఆయన సంగీతం అందించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను.
డైరెక్టర్ రమేష్ వర్మ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది. సినిమా చూసుంటారు కదా..ఇప్పుడు ఎలా అనిపించింది..?
ఈ సినిమా కథ మూడు సంవత్సరాల క్రితం విన్నానండి. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా...ఈ సినిమాలు చేయక ముందే ఈ కథ విన్నాను. అప్పుడే సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ...కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు కుదిరింది సినిమా చేసాం.ఈ కథతో సినిమా చేస్తే ...నాతోనే చేస్తానని రమేష్ వర్మగారు చెప్పినట్టే నాతోనే చేయడం హ్యాపీగా ఉంది.
ఈ సినిమాలో ఉన్న హైలెట్ ఏమిటి..?
కథే సినిమాకి హైలెట్. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సంభాషణలు, సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి.
జాదుగాడు అనే మాస్ మూవీ చేసారు కదా..? ఆ సినిమా నుంచి ఏమి నేర్చుకున్నారు..?
జాదుగాడు నుంచి చాలా నేర్చుకున్నానండి. మూవీ ఫెయిల్ అయినా ఆర్టిస్ట్ గా ఫెయిల్ అవ్వలేదు. జాదుగాడు రాంగ్ స్టెప్ ఫర్ మి. ఎందుకంటే నేను ఇప్పుడు చేయాల్సిన సినిమా కాదు అన్నారు. నన్ను మాస్ లుక్ లో చూడటానికి ప్రేక్షకులు రెడీగా లేనప్పుడు నేను చేసి వేస్ట్ కదా...అందుకని రెండు, మూడేళ్ళ తర్వాత మాస్ మూవీస్ చేస్తాను. అప్పటి వరకు ఫ్యామిలీ మూవీస్, యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చేస్తాను.
జ్యోఅచ్యుతానంద చేస్తున్నారు కదా..ఈ సినిమా ఎలా ఉంటుంది..?
ఇది కుటుంబమంతా కలసి చూసే సినిమా. ఇంకా చెప్పాలంటే విందు భోజనం లాంటి సినిమా.
కళ్యాణ వైభోగమే 3 సాంగ్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమా గురించి ఏం చెబుతారు..?
జనవరి 3న కళ్యాణ వైభోగమే ఆడియో రిలీజ్ చేస్తున్నాం. అలాగే....జనవరిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం.
మీ గురించి వచ్చే న్యూస్ అండ్ రూమర్స్ కి ఎలా రియాక్ట్ అవుతారు. ఇటీవల రాశి ఖన్నా నాగ శౌర్యతో డేటింగ్ చేయడం లేదని చెప్పారు..మీ కామెంట్ ఏమిటి..?
ఈ ఫీల్డ్ లో రూమర్స్ అనేవి కామన్. అందుచేత వాటి గురించి అసలు ఆలోచించను.నిజంగా రాశి ఖన్నాకు నాకు మధ్య ఏమీ లేదండీ. రాశి కన్నా, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ , నాకు ఊహలు గుసగుసలాడే ఫస్ట్ ఫిలిం. అందుచేత మా ముగ్గురికి స్పెషల్ బాండ్ ఉంది. అంతే తప్ప ఇంకేమి లేదు.
ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో అనుకున్న స్ధాయి వచ్చింది అనుకుంటున్నారా..?
ఇంకా నేను జీరో అనే అనుకుంటున్నాను. 2016 లో ఓ స్టెప్ ఎదుగుతానని అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో..?
నెక్ట్స్ ఇయర్ నాలుగు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసినట్టున్నారు..?
అవును...నెక్ట్స్ ఇయర్ నా సినిమాలు నాలుగు రిలీజ్ అవుతాయి. అయితే అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగం సినిమాలు డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కుదరకపోవడం వలన జనవరికి వచ్చేసాం. ఈ రెండు సినిమాలతో పాటు జ్యోఅచ్చుతానంద, ఒక మనసు సినిమాలు కూడా నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ అవుతాయి.
అబ్బాయితో అమ్మాయి గురించి ఆడియోన్స్ కి ఏం చెబుతారు..?
ఫ్రెండ్స్, ఫ్యామిలీ..తో కలసి చూసే సినిమా ఇది. లైఫ్ లో ఏదైనా జరిగితే వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక మనిషి మరో మనిషిని ఎలా మార్చాడనేది ఈ సినిమాలో చూపించాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ఒక మనసు షూటింగ జరుగుతుంది. ఫిబ్రవరి 10 నుంచి జ్యోఅచ్చుతానంద షూటింగ్ ప్రారంభం అవుతుంది. కొత్త డైరెక్టర్ సాయితో చేసే సినిమా కూడా ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout