ద్విభాషా చిత్రంలో నాగశౌర్య

  • IndiaGlitz, [Friday,May 19 2017]

మ‌ద్రాసు ప‌ట్ట‌ణం, అభినేత్రి చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ఇప్పుడు మ‌రో ద్విభాషా చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళంలో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే తెలుగు, త‌మిళంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో నాగ‌శౌర్య హీరోగా న‌టించ‌నున్నాడు.

నాగ‌శౌర్య స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. త‌మిళంలో 'క‌రు' అనే పేరుతో సినిమా తెర‌కెక్క‌నుంది. తెలుగులో ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమాతో నాగ‌శౌర్య త‌మిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు త‌ర‌హాలో త‌మిళంలో స‌క్సెస్ సాదిస్తాన‌ని నాగ‌శౌర్య కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.