నాగశౌర్యకి ఈ సారైనా..
Send us your feedback to audioarticles@vaarta.com
జయాపజయాలకు అతీతంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న యువ కథానాయకుడు నాగశౌర్య. 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా' చిత్రాలతో నటుడిగా సత్తా చాటుకున్న శౌర్య.. 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'జాదుగాడు'లతో తుస్సుమనిపించాడు. ఈ నేపథ్యంలో కొత్త చిత్రాల విషయంలో బాగానే ఫోకస్ పెట్టాడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
అలా ఫోకస్ పెట్టిన సినిమాలలో ఒకటైన 'అబ్బాయితో అమ్మాయి' డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. గతేడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' నాగశౌర్యని నిరాశపరిచింది. అదే టైంలో మరోసారి వస్తున్న అతనికి ఈ సారైనా విజయం వరిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com