దర్శకుడికి నాగశౌర్య ఖరీదైన కానుక
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనందాన్ని పది మందితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుందంటారు. ప్రస్తుతం నాగశౌర్య ఈ నానుడిని ఫాలో అయిపోతున్నారు. నిర్మాతగా తన సంస్థలో నిర్మించిన మొదటి చిత్రం ఛలో`.. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య పగ, ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కామెడీకి పెద్దపీట వేసారు. చక్కటి కామెడీ, వినసొంపైన పాటలతో సినిమా ఆద్యంతం వినోదంగా సాగింది. అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైజాగ్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు.
త్వరలో సక్సెస్ ఈవెంట్‌ను కూడా నిర్వహించనున్నారు. అంతేగాకుండా, ఈ ఈవెంట్‌లో చిత్రం కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి బహుమతులు అందివ్వనున్నారని సమాచారం. అలాగే ఎంతో కాలం నుంచి ఊరిస్తున్న విజయాన్ని, అలాగే తన కెరీర్లో గుర్తుండిపోయే విజయాన్నిఅందించిన దర్శకుడు వెంకీ కుడుముల కోసం నాగశౌర్య ఒక కారును బుక్ చేసారని...అది ఈవెంట్ జరిగే రోజునే వేదిక పైనే ఇవ్వనున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com