ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం ఆమెతో ఎఫైర్ ఉన్నట్టు ఎందుకు రాయరు - నాగ శౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక నటించిన చిత్రం ఒక మనసు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంటగా నటించారు. రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఒక మనసు చిత్రాన్నిఈనెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మనసు హీరో నాగ శౌర్య తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఒక మనసులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు సూర్య. నేను బయట ఎలా ఉంటానో ఈ చిత్రంలో కూడా అలానే ఉంటాను. పొలిటిషన్ అవ్వాలనుకునే వాళ్లు ఎలా ఉంటారో అలా నా క్యారెక్టర్ ఉంటుంది.
పొలిటిషియన్ అవ్వాలనుకునే క్యారెక్టర్ అంటున్నారు...మీ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయా..?
డిఫరెంట్ షేడ్స్ అంటూ ఏమీ ఉండవండి. ఇంకా చెప్పాలంటే...ఇందులో హీరో, విలన్స్ అంటూ సపరేట్ గా ఉండరు. జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి.
డైరెక్టర్ రామరాజు గురించి..?
ప్రతి సీన్ ని చాలా బాగా వివరించి చెప్పేవారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. కథ ఎలా చెప్పారో అలా చాలా చక్కగా తెరకెక్కించారు.
ప్రేమ కథా చిత్రాలు చాలా వచ్చాయి కదా..మరి..ఒక మనసులో ఉన్న కొత్తదనం ఏమిటి..?
సినిమాలో ప్రేమను 10% చూపించామా..? 100% చూపించామా..? అనేదే ఉంటుంది తప్పా...ప్రేమ అనే అంశం లేనిదే సినిమానే లేదు. ఇక మా సినిమా గురించి చెప్పాలంటే...మరో చరిత్ర, గీతాంజలి, ఏమాయ చేసావే చిత్రాల వలే ఒక మనసు ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోతుంది.
నిహారిక తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ అని ఫస్ట్ భయపడ్డాను. నన్ను ఎవరూ పట్టించుకోరేమో అనుకున్నాను. కానీ...సెట్స్ లో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్ లో నాకు నచ్చిన హీరోయిన్స్ నిహారిక, మాళవిక. ఎందుకంటే తెలుగులో డైలాగ్స్ చెప్పేవారు. వీళ్లతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను.
నిహారికతో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై మీ కామెంట్ ఏమిటి..?
నేను ఏ హీరోయిన్ తో వర్క్ చేస్తే ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాను...ప్రేమలో పడ్డాను అంటూ రాస్తున్నారు. రాశీ ఖన్నా, సోనారిక..ఆఖరికి రెజీనాతో నటించకపోయినా తనతో కూడా డేటింగ్ చేస్తున్నాను అంటూ రాసేసారు. ఇప్పుడు నిహారిక అంటున్నారు. ఫస్ట్ ఇలాంటి వార్తలు విని మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటిరా..ఈ వార్తలు అంటూ భయపడి పోయేవారు. ఇప్పుడు వాళ్లకు అలవాటైపోయింది. అనుష్క అంటే నాకు ఇష్టం అని చాలా సార్లు చెప్పాను. కానీ...ఎప్పుడూ అనుష్క తో డేటింగ్ చేస్తున్నట్టు రాయలేదు ఎందుకనో..? (నవ్వుతూ..)
జ్యోఅచ్యుతానంద ప్రొగ్రెస్ ఏమటి..?
60% షూటింగ్ పూర్తయ్యింది. ఒక మనసు రిలీజైన రెండు నెలల్లో ఈ చిత్రం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.అలాగే సుకుమార్ నిర్మాతగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com