హిట్ డైరెక్టర్‌తో నాగశౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
`@నర్తనశాల` తర్వాత నాగశౌర్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు రెండు సినిమాలను ప్రారంభించబోతున్నాడు. ఒక సినిమాను తన స్వంత బ్యానర్‌లో కొత్త దర్శకుడితో చేయబోతుండగా.. మరో సినిమాలో బయట బ్యానర్‌లో చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు కాకుండా శౌర్య మరో సినిమాను సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ యువ దర్శకుడు గత ఏడాది సుమంత్‌తో `సుబ్రహ్మణ్యపురం` సినిమాను డైరెక్ట్ చేసి విజయాన్ని సాధించాడు.
నాగశౌర్య, సంతోష్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా కూడా మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లోనే తెరకెక్కనుందట. ఈ సినిమాలో నాగశౌర్య తెలంగాణకు చెందిన యువకుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అంతా పూర్తయిన తర్వాత సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments