ఒకే హీరోయిన్‌తో నాగశౌర్య రెండు చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, జో అచ్యుతానంద చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో కొత్త దర్శకుడు వెంకీ రూపొందిస్తున్న ఛలో విడుదలకు సిద్ధమైంది. ఇందులో రష్మిక మండన్న కథానాయికగా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకు కన్నడంలో హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
కాగా, నాగశౌర్య నటించనున్న మరో చిత్రంలోనూ రష్మిక హీరోయిన్‌గా ఎంపికయిందని తెలుస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఛలో సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడం వల్లే ఈ జోడీని మరోసారి ఎంచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి తెలుగులో ఒక్క సినిమా విడుదల కాకుండానే.. ఈ ముద్దుగుమ్మ క్రేజీ హీరోయిన్‌గా మారిందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments