‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్.
చిత్ర కథ,సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ లో. నాయకా,నాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు,ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటీ నటుల (నాగశౌర్య, రీతువర్మ, నదియ, హిమాజ, వెన్నెల కిషోర్, ప్రవీణ్) ఉత్తమాభినయం టీజర్ లో ప్రతి క్షణం క(అ)నిపిస్తాయి. ఖచ్చితంగా ‘వరుడు కావలెను‘ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాలలో ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి. ఓ ఫీల్ గుడ్ మూవీని చూడ బోతున్నామన్న ఆసక్తిని కలిగిస్తుంది ఈ టీజర్. చివరలో హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలపటం కనిపిస్తుంది. ఇందులో అక్టోబర్ నెలలో చిత్రం ధియేటర్ లలో విడుదల అన్నది స్పష్టం చేశారు.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన '‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా', అలాగే 'దిగు దిగు నాగ' పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథానుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
'వరుడు కావలెను' చిత్రంలో నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout