నర్తన శాల నచ్చకపోతే చూడొద్దు . నచ్చితే పది మందికి చెప్పండి - హీరో నాగశౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఛలో లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ కాంబినేషన్ లో ప్రొడక్షన్ నెం-2 గా తెరకెక్కుతున్న చిత్రం @నర్తనశాల. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. . ఈనెల 30న నర్తన శాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.... నర్తన శాల అనే టైటిల్ పెట్టి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. క్లాసిక్ సినిమా టైటిల్ పెట్టడం చాలా కష్టం. కాంటెంపరరీగా ఎంటర్ టైన్ చేయడం కష్టం. ఈ సినిమా కోసం పడ్డ కష్టం నాకు తెలుసు. డైరెక్టర్ శ్రీనివాస్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వాడు. ఎంటర్ టైన్ మెంట్ పర్వం గీత గోవిందంతో ప్రారంభమైంది. నర్తనశాలతో కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. శౌర్య ఇప్పటికీ ఫోన్ వాడడు. యూనిక్ క్వాలిటీ అది. అంత కంటెంట్ గా ఉండడం చాలా కష్టం. ఉష గారు శంకర్ గారు శౌర్యకు మంచి సపోర్ట్. హీరోయిన్స్ కశ్మీరా, యామినీకి ఆల్ ది బెస్ట్. అజయ్ క్యారెక్టర్ నాకు తెలుసు. చాలా బాగుంటుంది. ఈ సినిమా అందరినీ తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. ఆగస్ట్ 30న రిలీజ్ అవుతోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ..... శౌర్యతో అర్జంట్ గా సినిమా చేయాలని ఉంది. ఐరా క్రియేషన్స్ ఉష... శంకర్ ప్రసాద్, బుజ్జి గారు ఇక్కడ లేని గౌతమ్ నాలుగు పిల్లర్స్. శౌర్య కథ విన్న వెంటనే నాకు చెప్పాడు. కచ్చితంగా హిట్ కొడుతున్నాం. అని అన్నాడు. హీరోయిన్స్ కు హార్టీ వెల్ కమ్. నా ఫేవరేట్ మహతి ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
శివాజీ రాజా మాట్లాడుతూ... ఉష గారు, శంకర్ ప్రసాద్, బుజ్జి గారు, సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి గురించి చెప్పుకోవాలి. అమృతంలో ఎలాంటి పాత్ర ఉందో అలాంటి క్యారెక్టర్ చేసాను. ఆర్టిస్ట్ కి శాటిస్ ఫాక్షన్ కావాలి. 450 సినిమాల్లో ఇది నా బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకుంటాను. ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా గురించి అజయ్ నేను తప్పుకుండా మాట్లాడుకుంటాం. సాంగ్స్ కూడా ఛలో ని మించి ఉన్నాయి. ఐరా క్రియేషన్స్ ప్రమోషన్స్ లో ఎవ్వరూ కొట్టలేరు. నెల రోజుల ముందు నుంచే పండగ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
యామినీ మాట్లాడుతూ.... వంశీ సర్ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థాంక్స్. ఐరా క్రియేషన్స్ మా టీం. అందరికీ ఫ్యామిలీ లాంటిది. అమ్మా నాన్నలాగా మమ్మల్ని చూసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. డైరెక్టర్ గారికి స్పెషల్ గా థాంక్స్. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గర్వంగా ఉంది. సుధ గారు నాకు అమ్మగా చేశారు. చాలా నాటీ. శివాజీరాజా గారు అదరగొట్టారు. అజయ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మహతి సాగర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. శౌర్య కు చాలా చాలా థాంక్స్. మీ ప్రేమ ఇలాగే కావాలి. మా అమ్మకు చాలా చాలా థాంక్స్. 30న సినిమా చూద్దాం. అని అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ... మా ఐరా క్రియేషన్స్ శంకర్ ప్రసాద్ గారికి, ఉష గారికి, శౌర్య గారికి చాలా చాలా థాంక్స్. ఫస్ట్ అవకాశం ఇచ్చే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. మంచి ప్రొడక్ట్ ఇచ్చానని నమ్ముతున్నాను. సినిమా కామిక్ గా ఉంటుంది. స్పీడ్ గా అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ఎడిటింగ్ లో సంతోష్. మ్యూజిక్ లో విక్కీ కి స్పెషల్ థాంక్స్. కాశీ రాజు గారు స్క్రిప్ట్ లో చాలా హెల్ప్ చేశారు. నా నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ చాలా థాంక్స్. అని అన్నారు.
కశ్మీరా మాట్లాడుతూ.... మీ ముందు ఇలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐరా ఫ్యామిలీ ఆంటీ అంకుల్, బుజ్జి గారు, శ్రీనివాస్ గారికి చాలా చాలా థాంక్స్. శౌర్య చాలా సపోర్ట్ చేశారు. మహతి మ్యూజిక్ చాలా బాగా చేశారు. విజయ్ మాస్టర్ లవ్ లీ కొరియోగ్రఫీ అందించారు. విజయ్ గారు కెమెరా వర్క్ తో బ్యూటిఫుల్ గా మలిచారు. అందరినీ తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది.
నాగశౌర్య మాట్లాడుతూ.... అభిమానులందరికీ చాలా చాలా థాంక్స్. నా కోసం చాలా దూరం నుంచి వచ్చారు. సినిమా మీద మీ అభిమానం చూపించారు. నన్ను ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకు చాలా చాలా థాంక్స్. వంశీ పైడిపల్లి అన్నకు స్పెషల్ గా థాంక్స్. ఛలో నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను. శివాజీరాజా గారు, జెపి, అజయ్, సుధ గారికి హీరోయిన్స్ కు థాంక్స్. యామినీ తెలుగమ్మాయి. కాశ్మీరా పూణే. ఇద్దరూ చాలా చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మహతి ఛలో సినిమాలో చూసి చూడంగానే అనే సూపర్ హిట్ సాంగ్ ఇచ్చాడు. అంత కంటే పెద్ద హిట్ సాంగ్ చేయాలనేది మా బుద్ది తక్కువతనం అవుతుంది.
మా ప్రొడక్షన్ నుంచి ఆసాంగ్ ని కొట్టే పెద్ద సాంగ్ రావాలని కోరుకుంటున్నాను. ఎగిరెనే సాంగ్ హిట్ అయ్యింది. నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడుతాను. డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పింది చెప్పినట్టుగా తీశారు. కెమెరా మెన్ విజయ్ గారికి చాలా చాలా థాంక్స్. డిఐ వర్క్ లో ఉండి ఇక్కడికి రాలేకపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా రాలేకపోయారు. వాళ్లను మిస్ అవుతున్నాను. మా పేరెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థాంక్యూ సోమచ్ అమ్మా నాన్న. నా కంటే మా అమ్మా నాన్నలకు ఫ్యాన్స్ ఎక్కువున్నారు. ఐయామ్ గ్లాడ్. మా ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేస్తున్న బుజ్జి అంకుల్, శ్రీనివాస్ రెడ్డి అంకుల్ కి చాలా చాలా థాంక్స్.
ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. మాకు నచ్చింది. నచ్చకపోతే ఎవ్వరూ చూడొద్దు. నచ్చితే మాత్రం ఇంకో పదిమందికి చెప్పండి. ఫ్యాన్స్ కి ఎంత ఇచ్చినా తక్కువే. ఛలోకి చెప్పాను. సినిమా తీయడం ఎంత గొప్పతనమో ప్రమోషన్ కూడా అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ప్రమోషన్ చేయడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఇన్ఫినిటమ్ అండ్ ఏలూరూ శ్రీను కి ప్రమోషన్ అప్పజెప్పాం. డే అండ్ నైట్ చాలా కష్టపడ్డారు. డెలివరీ టైం ఎంత పెయిన్స్ ఉంటాయో అంత పెయిన్స్ అనుభవించారు. చివరి నెల రోజులు ఈ సినిమాను చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఏలూరు శ్రీను, నివాస్, శ్యాం, రాహుల్ అంట్ టీం అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments