మెగా డాటర్‌ నిహారికతో పెళ్లి పై నాగశౌర్య క్లారిటీ!

  • IndiaGlitz, [Monday,May 06 2019]

సోషల్ మీడియా దెబ్బకు నటీనటులు జంకుతున్నారు. కొందరు వ్యూస్ కోసం ఏవేవో వీడియోస్ తయారు చేయడం.. కొన్ని వెబ్‌సైట్స్ ఇష్టానుసారం రాసేస్తుంటారు. ఈ పుకార్లపై స్పందిస్తే ఒక తలనొప్పి.. స్పందించకపోతే రియాక్ట్ కాలేదు కాబట్టి ఇవన్నీ నిజమేనని మళ్లీ కొత్త కథనాలు రాసేస్తుంటారు. ఇలా తయారైంది ప్రస్తుతం తెలుగు మీడియా పరిస్థితి. బహుశా నటీనటులల్లో బాధితులు కాని వారెవ్వరూ లేరనే చెప్పుకోవచ్చు.!

ఎన్నెన్ని వార్తలో..!

ఇక అసలు విషయానికొస్తే.. హీరో నాగశౌర్య గురించి చాలా రోజులుగా పుకార్లు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం ఎక్కడ వీటిపై రియాక్ట్ కాకపోవడంతో మరింత పెరిగాయి. దీంతో ఈ వ్యవహారంపై ఎట్టకేలకు ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. నాగశౌర్య సరసన నటించిన నిహారికను లవ్ చేశాడని పెద్దల అంగీకారంతోనే త్వరలో పెళ్లి చేసుకుంటున్నాడని పెద్ద ఎత్తున వార్తలు పుట్టించేశారు. అంతేకాదు రాశిఖన్నాతో ఎఫైర్ ఉందని కూడా వార్తలు వడ్డించేశాయ్ కొన్ని వెబ్ సైట్స్!. అంతేకాదు రష్మిక మందన్నా పేరు ఆ జాబితాలోనే ఉంది. ఇలా రూమర్స్ పెద్ద ఎత్తున రాసేసి చివర్లో అట.. అనే పదాలు తగించేశారు. ఇలాంటి వార్తలతో విసిగివేసారిపోయిన శౌర్య.. ఇక లాభం లేదని ఎట్టకేలకు పెదవి విప్పాడు.

పుకార్లకు ఫుల్‌స్టాప్!

నా మొదటి సినిమా అప్పటి నుంచి నాపై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నా దృష్టికి వచ్చినవి రెండే రెండు. అందులో ఒకటి శౌర్యకి పెళ్లైపోయింది. 2016లో నాగశౌర్యకి పెళ్లైపోయింది.. అందుకే రెండేళ్లు సినిమాలు చేయలేదని వార్త వచ్చింది. రెండోది రాశీఖన్నాతో మూడేళ్లుగా ఎఫైర్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. నేను ఎవరితోనూ లవ్‌లో లేను.. ఎవర్నీ పెళ్లి చేసుకోవట్లేదు.. ఎవరితోనూ ఎఫైర్‌ పెట్టుకోలేదు.. పెళ్లి అయితే నేను అందర్నీ పిలిచి మరీ చెబుతాను.

మీ ఇష్టానుసారం వార్తలు రాసేస్తే ఎలా..? ఇవన్నీ న్యూసెన్స్ తప్ప న్యూస్ కాదు.. ఏమైనా ఉంటే నేను చెప్తా న్యూస్. ఓ సినిమా తీసి హిట్ కొట్టి వాళ్ల నోరు మూయించాలనే తీరు నాది. సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేది ఒక జర్నీ మాత్రమే. ఎక్కువకాలం ఎవరు నిలవగలిగారు అన్నదే నాకు ముఖ్యం. హిట్ వచ్చిందని పొంగిపోను.. ఫ్లాప్ వచ్చిందని బాధపడిపోను అని నాగశౌర్య చెప్పుకొచ్చారు. సో.. ఎట్టకేలకు తనపై వస్తున్న రూమర్స్‌కు నాగశౌర్య ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇకనైనా రూమర్స్ ఆగుతాయో లేకుంటే కంటిన్యూ చేస్తారో వేచి చూడాల్సిందే మరి.