చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న '@నర్తన శాల'

  • IndiaGlitz, [Thursday,June 28 2018]

'ఛలో' ఘ‌న‌విజయం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన ఈ చిత్రం భారీ లాభాల‌నే మూట‌గ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి.. సొంత నిర్మాణ సంస్థ‌లోనే సినిమా చేస్తున్నారాయ‌న‌. ‘@నర్తన శాల’ అనే పేరుతో శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా.. టాకీ పార్ట్‌ను దాదాపు పూర్తిచేసుకుంద‌ని స‌మాచారం. టాకీ పార్ట్ పూర్త‌య్యాక పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం విదేశాల‌కు వెళ్ళ‌నుంది చిత్ర యూనిట్‌. అక్క‌డ జ‌రిగే షెడ్యూల్‌తో సినిమా పూర్త‌వుతుంది. ఆగ‌స్టులో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఛ‌లోతో సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకి కూడా స్వ‌రాలందిస్తున్నారు.

More News

చివ‌రి షెడ్యూల్ లో 'ఆయుష్మాన్ భవ' న‌వంబ‌ర్ 9న విడుద‌ల‌

నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌.

నాచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా 'కురుక్షేత్రం' ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్షన్ హీరో అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు అర్జున్. అందుకే  యాక్ష‌న్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు.

య‌స్‌.వి.ఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న‌

వెండితెర విల‌క్ష‌ణ న‌టుడు య‌స్‌.వి.ఆర్‌. శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న జ‌ర‌గ‌నున్నాయ‌ని 'సంగ‌మం ఫౌండేష‌న్ సంస్థ అధ్య‌క్షులు, సినీ ప‌రిశోధ‌కులు సంజ‌య్ కిశోర్ తెలిపారు.

'పంతం' ప్రీ-రిలీజ్ వేడుక డిటైల్స్‌..

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, పంజాబి ముద్దుగుమ్మ‌ మెహరీన్ జంటగా నటించిన చిత్రం 'పంతం'. 

'కన్నుల్లో నీ రూపమే' ఆడియో సక్సెస్ మీట్.....

ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం "కన్నుల్లో నీ రూపమే".