చిత్రీకరణ తుది దశకు చేరుకున్న '@నర్తన శాల'
Send us your feedback to audioarticles@vaarta.com
'ఛలో' ఘనవిజయం యువ కథానాయకుడు నాగశౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థలో చేసిన ఈ చిత్రం భారీ లాభాలనే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి.. సొంత నిర్మాణ సంస్థలోనే సినిమా చేస్తున్నారాయన. ‘@నర్తన శాల’ అనే పేరుతో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్నారు.
చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా.. టాకీ పార్ట్‌ను దాదాపు పూర్తిచేసుకుందని సమాచారం. టాకీ పార్ట్ పూర్తయ్యాక పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్ళనుంది చిత్ర యూనిట్. అక్కడ జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఛలోతో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మహతి సాగర్ ఈ సినిమాకి కూడా స్వరాలందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com