నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి , రచయిత కోన వెంకట్ లు చిత్రం స్క్రిప్ట్ ను చిత్ర దర్శక, నిర్మాతలకు అందచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్,ఉపేంద్ర లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నం గా నాగ శౌర్య కథానాయకుడు గా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం ను నిర్మిస్తోంది. 'మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య 'ఛలో' చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కధలోని నవ్యత, చిత్ర కధనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు.

నాగ శౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమ కదా చిత్రం నిస్సందేహంగా వైవిధ్యాన్ని సంతరించు కుని ఉంటుందని తెలిపారాయన. చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. 2018, జనవరి నెల ప్రథమార్ధం లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలిపారు.

More News

రామ్-త్రినాథ‌రావు-దిల్ రాజు కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న 'ఎం.సి.ఎ' చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు.

మ‌హేష్ సినిమా అప్‌డేట్స్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు.

వివ‌ర‌ణ ఇచ్చుకున్న త్రిష‌...

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త్రిష‌..విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' లో నుండి త‌ప్ప‌కుంది.  అస‌లు త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నే దానిపై త్రిష త‌న పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్యత సీక్వెల్‌లో లేద‌ని తెలియ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

టెలివిజ‌న్ సిరీస్ స్ఫూర్తితో వెంకీ, తేజ చిత్రం?

నేనే రాజు నేనే మంత్రితో ప‌దిహేనేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు తేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు.

మూడు రోజుల పండ‌గ

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క్రిస్మ‌స్ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. పండ‌గ సంద‌ర్భంలో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల కానుండ‌డ‌మే అందుకు కార‌ణంగా చెప్పొచ్చు.