జూన్ 8నుండి వైజాగ్ లో నాగశౌర్య చిత్రం రెండవ షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఛలో లాంటి చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.. జూన్ 8 నుండి వైజాగ్ లో రెండవ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్ , లైన్ ప్రోడ్యూసర్ బుజ్జి లు చిత్ర యూనిట్ కి విశాఖపట్నం లో షూటింగ్ కి కావలసిని అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.
నిర్మాత ఉషాముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు రమణ తేజ విజన్ తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిచనున్నారు. ఐరా క్రియేషన్స్ హ స్పిటాలికి కేరాఫ్ అడ్రాస్ గా టాలీవుడ్ లో పేరుంది దానికి తగ్గట్టుగానే వారి ప్రేమానురాగాలు యూనిట్ మెత్తం మీద చూపిస్తారు. మండే ఎండలు పోయి రుతుపవనాలు మెదలవుతున్న జూన్ 8 నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవటం శుభసూచకం. ఈ చిత్రంలో నాగశౌర్య కి జంటగా మెహరీన్ నటిస్తుంది.
నిర్మాతలు మాట్లాడుతూ.. ఛలో లాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని చాలా నిజాయితిగా నిర్మించాము. అంతే నిజాయితిగా అఖండ విజయం అందించారు మా బ్యానర్ లో చిత్రాలు అన్ని ప్రేక్షకుడు ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాము... ఛలో మంచి ప్రేమకథ, నర్తనశాల మంచి కామెడి చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే విధంగా నాగశౌర్య నటించే ప్రోడక్షన్ నెం 3 చిత్రం షూటింగ్ మెదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ 8 నుండి విశాఖపట్నం లోని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. హీరో నాగశౌర్య రాసిన కథకి దర్శకుడు రమణతేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థవంతంగా షూట్ చేస్తున్నాడు. మెహరిన్ హీరోయిన్ గా మరోక్కసారి ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది. అని అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments