రిస్క్ తప్పదు.. ఏడు డిఫరెంట్ పాత్రల్లో చేస్తున్నా: నాగశౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సినీ ప్రియులు మూవీస్‌ను చాలా క్లీన్ అబ్జర్వ్ చేస్తున్నారని అందుకే.. డూప్ లేకుండా సొంతంగా చేస్తున్నట్లు కుర్ర హీరో నాగ శౌర్య చెప్పుకొచ్చాడు. ‘ఓ బేబీ’ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మంగళవారం నాడు మీడియా మిత్రులకు నాగశౌర్య ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమాల్లో రిస్క్, డూప్, ప్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు.
అందుకే రిస్క్ చేస్తున్నా!
రిస్క్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందా అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురవ్వగా.. అవును రిస్క్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని.. అంత రిస్కు అవసరమా అంటే కచ్చితంగా అవసరమేనని నాగశౌర్య చెప్పాడు. ఆడియన్స్ చాలా క్లీన్‌గా సినిమాలు అబ్జర్వ్ చేస్తున్నారని.. అందులోనూ అది 14 నిమిషాల సీన్ డూప్ పెడితే ఆడియన్స్‌కి అర్థమైపోతుందని అందుకే హీరో పడే టెన్షన్ ఆడియన్ పడాలంటే తప్పకుండా తానే కష్టపడాలని అర్థమైందని అందుకే కష్టమైనా.. రిస్క్ అయినా భరించి చేస్తున్నానని కుర్ర హీరో చెప్పుకొచ్చాడు.
ఒకట్రెండు కాదు ఏకంగా ఏడు పాత్రల్లో!
ఓ బేబీ తర్వాత ఏయే సినిమాలు చేస్తున్నారు..? అని మీడియా ప్రశ్నించగా.. "మా ఓన్ ప్రొడక్షన్‌లో ‘అశ్వత్థామ’ చేస్తున్నాం. ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ అని అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్నాను. ‘పార్థు’ అని మరో సినిమా జరుగుతోంది. ‘అశ్వత్థామ’ కథా రచయితను నేనే. ‘చలో’కి కూడా నేనే కథ ఇచ్చాను. కానీ ఆ సినిమాకు పేరు వేసుకోలేదు. ఈ సినిమాకు వేసుకుంటున్నాను. ‘అశ్వత్థామ’ రెండు షెడ్యూళ్ల పూర్తయ్యాయి. ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ కూడా రెండు షెడ్యూళ్ల పూర్తయ్యాయి. ఈ సినిమాలో నేను ఏడు డిఫరెంట్ పాత్రలు చేస్తున్నా. వీటి తర్వాత ‘పార్థు’ సినిమా చేస్తాను" అని నాగ శౌర్య మీడియాకు నిశితంగా వివరించారు.
సో.. మొత్తానికి చూస్తే ఓ బేబీ తర్వాత నాగశౌర్య అస్సలు ఖాళీగా ఉండడన్న మాట. ఓ వైపు కథలు రాస్తూ.. మరోవైపు అదే కథలో తానే నటిస్తూ.. అంతేకాదు ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా సీన్లలో నటిస్తూ మెప్పిస్తున్న నాగశౌర్య మున్ముంథు సక్సెస్ అయ్యి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని www.indiaglitz.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments