డబుల్ ఢమాకా ఇవ్వబోతున్న నాగశౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘ఛలో’ చిత్రంతో.. కెరీర్లోనే తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య. గత కొంత కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. ఇదిలా ఉంటే.. వేసవిని టార్గెట్ చేస్తూ తను నటించిన రెండు సినిమాలు తెరపై సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నాగశౌర్య, సాయిపల్లవి నాయకానాయికలుగా ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కణం’. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. తమిళంలో ‘దియా’ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నాగశౌర్య తొలిసారిగా నటించిన ఈ బైలింగ్వల్ మూవీ ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే.. నూతన దర్శకుడు సుందర్ సూర్య దర్శకత్వంలో నాగశౌర్య, షామిలి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మే నెలలో విడుదలకు సిధ్ధంగా ఉంది. టాలెంటెడ్ హీరోయిన్స్‌తో వేసవిని టార్గెట్ చేస్తూ డబుల్ ఢమాకా ఇవ్వబోతున్న నాగశౌర్యకు.. ఈ రెండు చిత్రాలు ఏ మాత్రం ప్లస్ అవుతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments