పెళ్లిపై వస్తున్న వన్నీ రూమర్సే.. శౌర్య
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగశౌర్య ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 2న `ఛలో` చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదల ఒత్తిడి కంటే శౌర్యను తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ టెన్షన్ పెడుతుంది. మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికతో త్వరలోనే నాగశౌర్య పెళ్లి జరుతుందనే వార్తొకటి గుప్పుమంది.
అయితే తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తమని.. `నేను ఏ హీరోయిన్‌తో ప్రేమలో లేను. నా పెళ్లికి మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. అది కూడా మా అమ్మ ఒత్తిడి చేస్తేనే` అంటూ చెప్పుకొచ్చాడు. ఛలో విడుదల తర్వాత శౌర్య సాయిశ్రీరామ్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేయబోతున్నాడు. అలాగే శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో `నర్తనశాల` అనే సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com