పెళ్లిపై వస్తున్న వన్నీ రూమర్సే.. శౌర్య

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఈ శుక్ర‌వారం అంటే ఫిబ్ర‌వ‌రి 2న 'ఛ‌లో' చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుద‌ల ఒత్తిడి కంటే శౌర్య‌ను త‌న పెళ్లిపై వ‌స్తున్న రూమ‌ర్స్ టెన్ష‌న్ పెడుతుంది. మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు త‌న‌య నిహారిక‌తో త్వ‌ర‌లోనే నాగ‌శౌర్య పెళ్లి జ‌రుతుంద‌నే వార్తొక‌టి గుప్పుమంది.

అయితే త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌మ‌ని.. 'నేను ఏ హీరోయిన్‌తో ప్రేమ‌లో లేను. నా పెళ్లికి మూడు నాలుగేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అది కూడా మా అమ్మ ఒత్తిడి చేస్తేనే' అంటూ చెప్పుకొచ్చాడు. ఛ‌లో విడుద‌ల త‌ర్వాత శౌర్య సాయిశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్నాడు. అలాగే శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో 'న‌ర్త‌న‌శాల' అనే సినిమా చేయ‌బోతున్నాడు.