మే 10న 'నాగకన్య'

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు.

కాగా... ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా మే 10న గ్రాండ్ గా విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ తో పాటు ఆడియోకి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది, ఈ నేప‌థ్యంతోనే మే 10న నాగ‌క‌న్య ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.

వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా మే 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నాం. వేస‌విలో పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా నాగ‌క‌న్య చిత్రాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అని అన్నారు.

More News

'ఆకాశ‌వాణి' 90 శాతం చిత్రీక‌రణ పూర్తి

తొలిసారి ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, అశ్విన్ గంగ‌రాజు, కాల‌భైర‌వ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న వైవిధ్య‌మైన క‌థా చిత్రం `ఆకాశ‌వాణి `.

'మ‌హ‌ర్షి' చిత్రీక‌ర‌ణ పూర్తి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో

శ్రీరెడ్డి సక్సెస్.. ‘క్యాస్టింగ్ కౌచ్‌’‌‌పై కమిటీ ఏర్పాటు

టాలీవుడ్‌లో జరుగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్‌’ నటి శ్రీరెడ్డి ఉద్యమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం అన్ని సినీ ఇండస్ట్రీలకు తెలియడం..

పీఎన్‌బీలో ప్రకంపనలు.. ఖాతాల్లో లక్షలు మాయం

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయాల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

గుడ్ న్యూస్: స్టాండ్ బై జాబితాలో రిషబ్, రాయుడు

వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని టీమిండియా ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు బుధవారం నాడు బీసీసీఐ శుభవార్త చెప్పింది.