చైత‌న్య‌కు త‌ప్ప‌డం లేదా!!

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

హీరోలు కొన్ని ప్రాజెక్టులు చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా కూడా.. డైరెక్ట‌ర్, స్క్రీన్‌ప్లే న‌చ్చితే చేయాల్సి వ‌స్తుంది. అలా న‌చ్చ‌క‌పోయినా అక్కినేని నాగ‌చైత‌న్య ఓ జోన‌ర్ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కూ చైత‌న్య‌కు నచ్చ‌క‌పోయినా, త‌ను న‌టిస్తోన్న జోన‌ర్ మూవీ ఏంటో తెలుసా?.. హార‌ర్ జోన‌ర్‌. చిన్న‌ప్ప‌ట్నుంచి హార‌ర్ సినిమాలు చూడ‌టానికి నాగ‌చైత‌న్య చిన్న‌ప్ప‌ట్నుంచి భ‌య‌ప‌డేవాడ‌ట‌. అందుక‌నే ఇప్ప‌టి వ‌ర‌కు హార‌ర్ జోన‌ర్ సినిమాలు చేయ‌లేదు. ఈ విష‌యాన్ని చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పారు.

అయితే ఇప్పుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య చేస్తున్న సినిమా హార‌ర్ జోన‌ర్‌లో ఉంటుంద‌ని స‌మాచారం. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థాంక్యూ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఇందులో చైత‌న్య ఆర‌వై ఏళ్ల వ్య‌క్తి.. న‌ల‌బై ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కుడిగా, 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తార‌ని వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చైతు, సాయిప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్‌స్టోరి అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు.

More News

నిర్మాత‌కు డ‌బ్బులు వెన‌క్కిచ్చేసిన గోపీచంద్‌?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీంచ‌ద్ ఇప్పుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌ను ప్రారంభించిన భారత్

ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు

నాన్నగారిని కలిశాను.. నన్ను గుర్తుపట్టి మాట్లాడారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కాస్త కోలుకుంటున్నారని తెలుస్తోంది.

1 నుంచి విద్యార్థుల ఇళ్లలో మోగనున్న బడి గంటలు..

ఆన్‌లైన్ తరగతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.

టీఆర్ఎస్‌పై స్వామి గౌడ్ తిరుగుబావుటా.. ప్రస్తుతం ఆయన పయనమెటు?

శాసనమండలి చైర్మన్‌గా పదవీకాలం ముగిసిన నాటి నుంచి స్వామిగౌడ్ తిరుగు బావుటా ఎగరవేశారు.