చైత‌న్య డిజిటల్ ఎంట్రీ..?

  • IndiaGlitz, [Tuesday,February 09 2021]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా సాయిప‌ల్ల‌వితో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ‘ల‌వ్‌స్టోరి’ ఏప్రిల్ 16న విడుద‌ల కానుంది. ఇప్పుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ సినిమాలో న‌టిస్తున్నాడు చైత‌న్య‌. ఇలా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న చైత‌న్య డిజిట‌ల్ మాధ్య‌మంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ట్రెండ్‌కు అనుగుణంగా, డిజిట‌ల్ మీడియా ఎక్కువైంది. ప్రేక్ష‌కులు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ సంస్థ‌లు నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌ల‌ను చూడ‌టానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో వెండితెర స్టార్స్ అంద‌రూ డిజిట‌ల్ మీడియా వైపు నెమ్మ‌దిగా అడుగులు వేస్తున్నారు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే చాలా మంది టాప్ టెక్నీషియ‌న్స్‌, స్టార్స్ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చారు. వీరి బాట‌లో హీరో నాగ‌చైత‌న్య కూడా చేర‌బోతున్నాడ‌ట‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్, చైత‌న్య‌తో ఓ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడ‌ట‌. వ‌చ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే చైత‌న్య స‌తీమ‌ణి, స్టార్ హీరోయిన్ డిజిట‌ల్ మాధ్య‌మంలోకి అడుగు పెట్టేసింది. సామ్‌జామ్ షోతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం కాబోయే ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్‌లో న‌టించింది. మ‌రి చైత‌న్య డిజిట‌ల్ ఎంట్రీ వార్త‌ల్లో నిజానిజాలు ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

More News

త‌లైవా 169 ఫిక్స్‌..!

త‌లైవా ర‌జినీకాంత్ రాజ‌కీయాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయాల‌కు తాను దూరం అనే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించేశాడు.

బ్రేక్ తీసుకున్న బ‌న్నీ

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ‘పుష్ప‌’ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

‘పుష్ప’ లొకేష‌న్‌కు ‘ఆచార్య‌’..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

క్రేజీ కాంబినేష‌న్‌పై మైత్రీ మూవీస్ క‌న్ను...

పెళ్లిచూపులుతో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి బ్రేక్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. తదుపరి చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.

మెగా ఫ్యామిలీతో కీర‌వాణి సెంటిమెంట్‌..!

మెగాస్టార్‌.. ఆయ‌న న‌ట వార‌సులుగా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప‌రిచ‌యం అయ్యారు. అయితే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి