మా నాన్నే మా ఊపిరి - అఖిల్
Thursday, March 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ తమన్నాల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మల్టీస్టారర్ ఊపిరి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్నితెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో ఈ భారీ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది. ఈ నెల 25న ఊపిరి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఊపిరి ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో నాగ్ వారసులు చైతన్య, అఖిల్ రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా ....
అఖిల్ మాట్లాడుతూ...నాన్న ఊపిరి అన్నయ్య, నేను అంటున్నారు కానీ...మా నాన్నే మా ఊపిరి. ఈ టీమ్ చేసిన రెండు సంవత్సరాల హార్ట్ వర్క్ ట్రైలర్ లో కనిపించింది. ఈ సినిమా కథ గురించి తెలుసుకుని.... నాన్న కూర్చిలో కూర్చోవడం ఏమిటి..? అని నాన్నతో సినిమా చేయవద్దు అని చెప్పాను. ట్రైలర్ చూసి ఎమోషన్ అయిపోయాను. మనం సినిమాలో చివరిలో వచ్చి క్రెడిట్ నేను కొట్టేసాను అన్నారు. అలాగే ఈ సినిమాలో క్రెడిట్ కెమెరామెన్ కే ఇవ్వాలనిపిస్తుంది. ఈ సినిమా జర్నీలో రిలేషన్ షిప్ ఏర్పడ్డాయి. కార్తీ అంటే నాన్నకు విపరీతమైన ప్రేమ. ఓ మంచి చిత్రాన్ని తీసిన వంశీ పైడిపల్లిని అభినందిస్తున్నాను అన్నారు.
చైతన్య మాట్లాడుతూ...నాన్న సినిమా ట్రైలర్ మేము రిలీజ్ చేయడం అంటే మేము ఓల్డ్ అయిపోయి నాన్న యంగ్ అయిపోయారనిపిస్తుంది...(నవ్వుతూ..) ట్రైలర్ చాలా బ్యూటీఫుల్ గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే మాటలు రావడం లేదు. వంశీ సినిమా సినిమాకి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సినిమా చేయడానికి పి.వి.పి యాప్ట్ ప్రొడ్యూసర్. కంటెంట్ నమ్మి సినిమాలు తీస్తున్న పి.వి.పి కి ముందుగానే కంగ్రాట్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ...ఆద్యంతం నవ్విస్తూ..అక్కడక్కడ గుండెల్ని మెలిపెడుతుంటుంది. బాథ కలిగిస్తుంది అనుకునే టైంలో వెంటనే పెదాలపై చిరునవ్వు ఉండేలా ఈ సినిమా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.
రచయిత హరి మాట్లాడుతూ...అన్ని పాజిటివ్ పాత్రలతో ఉండే ఎమోషనల్ జర్నీ ఊపిరి. అందరికీ నచ్చుతుంది అన్నారు.
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...2014లో ఈ జర్నీ స్టార్ట్ చేసాం. నాగార్జునగారి కెరీర్ లో బెస్ట్ మూవీగా ఊపిరి నిలుస్తుంది. 60 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాం. మేము ఈ సినిమా చూసాం. మాకు చాలా బాగుంది. రిలీజ్ తర్వాత అందరూ ఇలాగే ఫీలవుతారని అనుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...ఊపిరి కొత్త ప్రయత్నం. నాగార్జున గారు - కార్తీ - పి.వి.పి ఈ ముగ్గురి నమ్మకమే ఈ సినిమా. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉన్న నిర్మాత కావాలి. పి.వి.పి ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యారీస్ లో 12 రోజులు లాండ్ మార్క్ లోకేషన్స్ ని చూపించాం. ఈ నెల 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. సమ్మర్ లో ఫస్ట్ హిట్ ఫిల్మ్ ఊపిరి అవుతుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments