Custody:చావు ఎటు నుంచైనా రావొచ్చు .. కానీ నిజం నా కస్టడీలోనే : ఆసక్తికరంగా ‘‘కస్టడీ’’ టీజర్, మాస్ లుక్‌లో చైతూ
Send us your feedback to audioarticles@vaarta.com
థాంక్యూ, లాల్ సింగ్ చద్దాలు నిరాశ పరచడంతో అక్కినేని వారసుడు నాగచైతన్యకు అర్జెంట్‌గా ఒక హిట్ పడాలి. అక్కినేని అభిమానులు ప్రస్తుతం ఇదే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైతూ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. వెంకట్ ప్రభుత దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో మే 12న రిలీజ్ చేయనున్నారు. నాగచైతన్య సరసన కృతిశెట్టి మరోసారి నటిస్తోంది. సీనియర్ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే కస్టడీ నుంచి రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
చైతూ గొంతుతోనే టీజర్ :
ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం టీజర్ రిలీజ్ చేసింది. చైతూ గొంతు వినిపించకుండా కథ మొత్తం చెప్పేలా టీజర్ కట్ చేశారు. అలాగే పాత్రలన్నింటినీ కూడా పరిచయం చేశారు. ‘‘ గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అదిప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం.. నిజం ఒక ధైర్యం... నిజం ఒక సైన్యం. యస్. ద ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ ’’ అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
యాక్షన్ సీక్వెన్స్‌లో వెంకట్ ప్రభు మార్క్ :
టీజర్‌తోనే సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా వుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా వెంకట్ ప్రభు స్టైల్‌లోనే వున్నాయి. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణ. ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments