మరోసారి హిట్ ఇచ్చిన దర్శకుడుతో చైతు...
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ప్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు కృష్ణ అనే కొత్త దర్శకుడుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది.
ఈ రెండు సినిమాలు కాకుండా తనకు ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడట. నిజానికి నాగార్జున, నిఖిల్ హీరోలుగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నా, నాగార్జున రాజుగారి గది 2 చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఈ గ్యాప్లో చందు మొండేటి చైతుతో ఓ సినిమాను చేయబోతున్నాడట. రీసెంట్గా కథ విన్న చైతు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తర్వలోనే సినిమా ట్రాక్ ఎక్కనుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments