నాగచైతన్య బ్రేక్ వేస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,November 03 2015]

డిసెంబ‌ర్ నెల కింగ్ నాగార్జున‌కి ఫేవ‌రేట్ మంత్‌. ఎందుకంటే.. 'మ‌న్మ‌థుడు', 'మాస్‌', 'కింగ్‌', 'రాజ‌న్న‌'.. ఇలా నాగ్‌కి సంబంధించిన కొన్ని మెమ‌ర‌బుల్ మూవీస్ ఈ నెల‌లోనే సంద‌డి చేశాయి. నాగ్‌కి అంత‌గా ఆ నెల క‌లిసొచ్చింద‌న్న‌మాట‌. అయితే.. నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌కి మాత్రం డిసెంబ‌ర్ నెల చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. గ‌తంలో ఇదే నెల‌లో వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌ 'బెజ‌వాడ' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఈ నేప‌థ్యంలో అదే డిసెంబ‌ర్‌లో త‌న కొత్త చిత్రం 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'తో రానున్న నాగ‌చైత‌న్య.. ఆ నెగెటివ్ సెంటిమెంట్‌కి బ్రేక్ వేస్తాడేమో చూడాలి.