Naga Chaitanya: అభిమానుల ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసిన నాగచైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని హీరో నాగచైతన్య తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. చైతూ మొదటిసారి మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘ధూత‘ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో చైతూ జర్నలిస్టుగా కనిపించనున్నారు. దీంతో చైతూ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
ప్రమోషన్లలో భాగంగా అభిమానుల ఇంటికి వెళ్లి వారికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. నవంబర్ 23న చైతన్య పుట్టినరోజు సందర్భంగా యూట్యూబర్ నిఖిల్‌తో కలిసి ఈ వీడియో చేశారు. యూట్యూబర్ చై ఫ్యాన్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాలని అడుగుతారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ చైతూకు విష్‌స్ చెబుతున్న సమయంలో ఆయన వారి ఇంటి డోర్ తీసి కనపడడంతో వాళ్లు ఆశ్చర్యపోతారు. అనంతరం వారితో కలిసి సరదాగా కాసేపు కబుర్లు చెబుతారు. తమ అభిమాన నటుడిని దగ్గరి నుంచి చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే చందు మొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో క్యూట్ హీరోయిన్ సాయి పల్లవి చైకు జంటగా నటిస్తుంది. ఉపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం చైతూ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com