ఆరోజు చైతు మ‌ర‌చిపోలేని రోజు..!

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య జీవితంలో జ‌న‌వ‌రి 29 మ‌ర‌చిపోలేని రోజుగా మార‌బోతుంది అట‌. ఇంత‌కీ విశేషం ఏమిటి అనుకుంటున్నారా..? ఒక‌టి కాదు రెండు విశేషాలు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అందులో ఒక‌టి చైతు, స‌మంతల నిశ్చితార్ధం ఈనెల 29న జ‌ర‌గ‌నుంది అని స‌మాచారం. హైద‌రాబాద్ లో ఘ‌నంగా ఈ నిశ్చితార్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.

ఇక రెండో విష‌యం ఏమిటంటే...చైత‌న్య హీరోగా రానా ద‌గ్గుబాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా ఈనెల 29న ప్రారంభించనున్నార‌ని తెలిసింది. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మించాలి అనుకున్నారు. అయితే... రానా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న‌ట్లు ఇది నిజ‌మైతే నిజంగానే ఈనెల 29 చైతు లైఫ్ లో మ‌రిచిపోలేని రోజు అవుతుంది.

More News

'కేశవ' నైజాం హక్కులు దక్కించుకున్న ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సునీల్..!

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.

ఈనెల 9న మంచు విష్ణు 'లక్కున్నోడు' ఆడియో రిలీజ్..!

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి.సినిమా పతాకంపై 'గీతాంజలి' ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో

అఖిల్ మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్..!

అక్కినేని అఖిల్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

రాఘవ లారెన్స్ 'శివలింగ' సింగిల్ ట్రాక్ వస్తోంది..!

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా,పి.వాసు దర్శకత్వంలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం 'శివలింగ'.

18వ సారి పోటీపడుతున్న చిరంజీవి - బాలకృష్ణ..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్నితెరకెక్కించారు.