నిర్మాతగా మారుతున్న అక్కినేని హీరో!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను అక్కినేని కుటుంబ సభ్యులు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఓ అక్కినేని హీరో స్వంత నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగచైతన్య. చాలా రోజుల నుండి చైతన్య ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఎంకరేజ్ చేస్తారనే వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా తొలి చిత్రంగా రాజ్ తరుణ్ హీరోగా చైతన్య ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమాను శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్ట్ చేయబోతన్నాడు. ఇందులో హీరోయిన్‌గా అవికాగోర్ నటించనుంది.
రాజ్‌తరుణ్, అవికాగోర్ గతంలో ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. సినిమా భారీ విజయాన్ని సాధించింది. తర్వాత సినిమా చూపిస్తమావ చిత్రంలోనూ జోడీ కట్టారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. అయితే తర్వాత ఈ జోడీ మరో సినిమాలో కలిసి నటించలేదు. మధ్య అవికాగోర్ సినిమా రంగానికి దూరమైంది. గత ఏడాది ఈ అమ్మడు రాజుగారిగది 3 చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఈ జోడీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. వివరాల్లోప్రస్తుతం కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఈ కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుందని వార్తలు వినపడుతుతన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com