చైతు మైక్ పట్టనున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
చైతన్య అక్కినేని కథానాయకుడుగా వెంకటేశ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. వెంకీ మామ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించనున్నారు. కాగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగచైతన్యతో ఓ పాట పాడించాలని తమన్ భావిస్తున్నాడట.
సాధారణంగా తమన్.. హీరోలందరితో పాటలు పాడిస్తుంటాడు. ఈ లిస్టులో చైతన్యను చేర్చబోతున్నాడని సమాచారం. మరి చైతన్య తమన్ మాట విని పాట పాడుతాడా? అని చూడాలి. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com