చైతన్య మూడోసారి రిపీట్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగచైతన్య ఇప్పటివరకు 14 చిత్రాల్లో హీరోగా నటిస్తే.. వాటిలో ఆరు విజయాలున్నాయి. ఆ ఆరు విజయాల్లోనూ రెండేసి సందర్భాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉండడం గమనార్హం. 'ఏ మాయ చేసావె', '100% లవ్' చిత్రాలతో తన కెరీర్‌లోనే మొదటి సారిగా బ్యాక్ టు బ్యాక్ విజయాలను చవిచూసిన నాగచైతన్యకి..ఆ తరువాత మళ్లీ 'తడాఖా', 'మనం' చిత్రాలతో ఇలాంటి సందర్భం రెండో సారి అనుభవం లోకి వచ్చింది.
ఇప్పుడు 'యుద్ధం శరణం'తో ఈ ఫీట్‌ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. వేసవికి విడుదలైన 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్ కొట్టిన నాగచైతన్యకి ఈ 'యుద్ధం శరణం' సినిమా కూడా విజయం సాధిస్తే.. ముచ్చటగా మూడోసారి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని టేస్ట్ చూసినట్లవుతుంది. 'యుద్ధం శరణం' సెప్టెంబర్ 8న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com