నాగార్జున సూపర్ మాస్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న నాగచైతన్య

  • IndiaGlitz, [Thursday,April 12 2018]

నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్ ను యువసామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం సవ్యసాచిలో రీమిక్స్ చేస్తున్నాడు.

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిన్ని రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు రీమిక్స్ లో చైతూతో ఓ అగ్ర కథానాయకి ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శకనిర్మాతలు.

ఒరిజినల్ వెర్షన్ ను కంపోజ్ చేసిన కీరవారి ఈ రీమిక్స్ వెర్షన్ కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది.

నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM), కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.

More News

సమంత-ఆది 'యు టర్న్' సెకండ్ షెడ్యూల్ మొదలు

'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి విశేషమైన రీతిలో అశేష ప్రేక్షకలోకాన్ని మైమరపించిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం 'యు టర్స్'.

1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌

అనుప‌మ.. త‌న పేరుతోనే

'అఆ' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

సుకుమార్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి

'రంగ‌స్థ‌లం'తో కెరీర్ బెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌.

మా అసోసియేషన్ వారి వలన శ్రీరెడ్డి సమస్యకు పరిష్కారం దొరకదు : కేతిరెడ్డి

మహిళల పై సినీరంగంలో, కాల్ సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాలలో,లైంగిక వేధింపులు ఈ దేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని,తమకు జరిగిన అన్నాయం ను ముందుకు వచ్చి చైపే మహిళల్ని