Thandel:ఈపాలి ఏట గురితప్పదేలే.. చైతూ'తండేల్' గ్లింప్స్ అదిరింది..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగతా ‘తండేల్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో క్యూట్ బేబీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్, చైతూ ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. తాజాగా తొలి ప్రచార వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కథ ఏంటో చెప్పేశారు.
ఉపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం చైతూ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యాడు. తొలిసారి శ్రీకాకుళం యాసలో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక వీడియోలో నాగ చైతన్య, అతని స్నేహితులు సముద్రంలోకి వెళ్లడం, పాకిస్తాన్ సైనికులకు దొరికిపోవడం వంటి అంశాలు ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.
"దద్దా గుర్తెట్టుకో, ఈపాలి ఏట గురితప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే''అని చెప్పడం.. చివర్లో బుజ్జమ్మ కాస్త నవ్వరాదే అంటూ సాయిపల్లవిని చూపించడం.. మధ్యలో పాక్ సైనికులకు చైతూ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే గూస్‌బంప్స్ రావడం పక్కా. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరామెన్ చూపించిన విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. మొత్తానికి ఈ గ్లింప్స్ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com