Thandel:ఈపాలి ఏట గురితప్పదేలే.. చైతూ'తండేల్' గ్లింప్స్ అదిరింది..

  • IndiaGlitz, [Saturday,January 06 2024]

అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగతా ‘తండేల్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో క్యూట్ బేబీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్, చైతూ ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. తాజాగా తొలి ప్రచార వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కథ ఏంటో చెప్పేశారు.

ఉపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం చైతూ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యాడు. తొలిసారి శ్రీకాకుళం యాసలో డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఇక వీడియోలో నాగ చైతన్య, అతని స్నేహితులు సముద్రంలోకి వెళ్లడం, పాకిస్తాన్ సైనికులకు దొరికిపోవడం వంటి అంశాలు ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.

దద్దా గుర్తెట్టుకో, ఈపాలి ఏట గురితప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే''అని చెప్పడం.. చివర్లో బుజ్జమ్మ కాస్త నవ్వరాదే అంటూ సాయిపల్లవిని చూపించడం.. మధ్యలో పాక్ సైనికులకు చైతూ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే గూస్‌బంప్స్ రావడం పక్కా. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరామెన్ చూపించిన విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. మొత్తానికి ఈ గ్లింప్స్ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More News

Prajapalana:ప్రజాపాలన కార్యక్రమానికి నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకున్నారా..?

తెలంగాణలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది.

Ambati Rayudu:బిగ్ బ్రేకింగ్: వైసీపీకి ఊహించని షాక్.. అంబటి రాయుడు రాజీనామా..

వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల పార్టీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీని వీడుతున్నట్లు  ప్రకటించారు.

Pawan:పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు.. దోచుకునేందుకే కొత్త చట్టం: పవన్

సీఎం జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూహక్కుల చట్టం తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆరోపించారు.

Keshineni Nani:టీడీపీకి రాజీనామా చేస్తా.. మరో బాంబ్ పేల్చిన కేశినేని నాని..

విజయవాడం ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) మరో బాంబ్ పేల్చారు. త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు.

Kapu Ramachandra Reddy: జగన్‌ను నమ్మి సర్వనాశనం అయ్యా.. వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా..

ఇంఛార్జ్‌ల మార్పు అధికార వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు.