చైతు స‌ర్‌ప్రైజ్....

  • IndiaGlitz, [Wednesday,November 08 2017]

తాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నాన‌ని ఆనందం వ్య‌క్తం చేస్తుంది హీరోయిన్ స‌మంత‌. హీరో నాగ చైత‌న్య‌, స‌మంత‌ల‌కు గ‌త నెల పెళ్లైన సంగ‌తి తెలిసిందే. పెళ్లైన త‌ర్వాత చైతు స‌మంతకు చిన్న‌పాటి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడ‌ట. అదేంటంటే..సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'రంగ‌స్థ‌లం 1985' చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది.

ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత చైత‌న్య త‌న కోసం చేసిన వంట చూసి స‌మంత ఎంతో హ్యాపీగా ఫీల‌య్యింద‌ట‌. చైత‌న్య వంట చేస్తున్న ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. చైత‌న్య వంట చేయ‌డంతో పాటు పువ్వులు, క్యాండిల్స్‌తో అలంక‌రించాడ‌ట‌. చైత‌న్య ఇప్పుడు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'స‌వ్య‌సాచి' కాగా, మ‌రొక‌టి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'శైలజారెడ్డి అల్లుడు'.