‘లవ్‌స్టోరీ’ సంగతి తర్వాత.. చైతూ పెర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అందమైన ప్రేమకథ ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న అప్‌డేట్స్‌కైతే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘సారంగదరియా’ సాంగ్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో సాంగ్ విడుదలైంది. వర్షంలో ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
‘ఏవో ఏవో కలలే’ అంటూ సాగే ఈ పాటను ప్రిన్స్ మహేష్‌బాబు లాంచ్ చేశారు. ఈ సాంగ్ విషయానికి వస్తే.. సాయి పల్లవి గురించి చెప్పనవసరం లేదు. ఆమె డ్యాన్స్ సాధారణంగానే ఇరగదీస్తుంది. అలాంటి సాయి పల్లవితో సరిసమానంగా డ్యాన్స్ చేయాలంటే కాస్త ధైర్యం ఎక్కువే కావాలి. ఇక నాగ చైతన్య వంటి హీరోకైతే ఈ పాట చూడకుంటే అసాధ్యమనే చెప్పేవాళ్లం. కానీ ఈ పాట చూశాక ఆ మాట మాత్రం చెప్పలేం. ఎందుకంటే సాయి పల్లవితో సమానంగా ఈ పాటలో నాగ చైతన్య స్టెప్పులు ఇరగదీశాడు. ఏమాత్రం కళ్లు సాయి పల్లవి వైపు పోకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ రేంజ్ డ్యాన్స్ గతంలో ఏ సినిమాలోనూ చైతూ చేయలేదు.
మరి సాయి పల్లవి పక్కన కాబట్టి తగ్గకూడదని అలా చేశాడో కానీ మొత్తానికి మెస్మరైజ్ చేసేశాడు. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యానికి, పవన్ సిహెచ్ స్వరాలు కూర్చగా జోనితా గాంధీ, నకుల్ అభ్యాంకర్ ఆలపించిన ఈ గీతం టాక్ ఆఫ్‌ది లవర్స్‌గా నిలుస్తోంది. మహేష్ చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ అవడం అభిమానుల్లో మంచి జోష్‌ను నింపుతుంటే.. మరోవైపు ఈ పాటను తన ఫేవరెట్ సాంగ్‌గా పేర్కొంటూ సమంత ట్వీట్ చేయడం దీనికి మరింత హైప్‌ను ఇచ్చింది. ఈ సాంగ్స్‌తో పాటు అప్‌డేట్స్ అన్నీ అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments