డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌చైత‌న్య‌

  • IndiaGlitz, [Saturday,June 16 2018]

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్‌ కథానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, భూమికా చావ్లా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడిపాడ‌నుంది. ఎం.ఎం.కీర‌వాణి స్వ‌ర‌క‌ర్త‌.

హ్యాట్రిక్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం నాగచైతన్య త‌న పాత్ర‌కు డబ్బింగ్ చెబుతున్నార‌ని తెలిసింది. ఇదిలా ఉంటే.. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్య‌మున్న ఈ చిత్రం కోసం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’తో పాటు అనేక‌ ప్రతిష్టాత్మక చిత్రాలకి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చిన మకుట సంస్థ వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. జూలై 27న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.

More News

సమ్మోహనంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం..

సుధీర్‌బాబు,  అదితిరావు హైదరీ జంట గా  శ్రీదేవి మూవీస్ పతాకం ఫై   ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో

బాల‌య్య కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న రైట‌ర్‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కి క‌లిసొచ్చిన రైట‌ర్స్‌లో ఎం. ర‌త్నం ఒక‌రు. 'సింహా', 'లెజెండ్', 'జై సింహా' చిత్రాల‌కు ఆయ‌న అందించిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

క్లైమాక్స్ దిశ‌గా రామ్ చ‌ర‌ణ్ చిత్రం

యాక్షన్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి  తెలిసిందే.

శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ లో నారా రోహిత్‌

నారా రోహిత్‌, కృతిక , నీలమ్‌ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా  శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ పతాకంపై కార్తికేయను దర్శకుడుగా పరిచయం చేస్తూ కోటి తూముల  నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం'2 చిత్రం

ఇంద్ర‌గంటి అదే ఫాలో అవుతారా?

ఓ సినీ తార‌కి, సినిమాలంటే అస్స‌లు ఇష్టం లేని ఓ యువ‌కుడికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన చిత్రం స‌మ్మోహ‌నం.