డబ్బింగ్ చెబుతున్న నాగచైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య, యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. ఎం.ఎం.కీరవాణి స్వరకర్త.
హ్యాట్రిక్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’తో పాటు అనేక ప్రతిష్టాత్మక చిత్రాలకి విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన మకుట సంస్థ వర్క్ చేస్తుండడం విశేషం. జూలై 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com