వైజాగ్ లో చైతు, శ్రుతి..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ సమ్రాట్ నాగ చైతన్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం ఈనెల 3 నుంచి వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం నాగ చైతన్య, శ్రుతి హాసన్ ల పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో శ్రుతి హాసన్ కనిపించే అన్ని సీన్స్ లో చీరలోనే కనిపిస్తుందట. అలాగే..నాగ్, వెంకీ ఈ మూవీలో అతిధి పాత్రలు పోషిస్తుండడం విశేషం.
ఈ చిత్రానికి గోపీ సుందర్ , రాజేష్ మురుగేశన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ తెలుగులో కూడా ఆస్ధాయిలో సక్సెస్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ చిత్రాన్నిసమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com