అక్కినేని నాగచైతన్య , శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగ చైతన్య, శ్రుతి హాసన్ ల తొలి కాంబినేషన్లో 'కార్తికేయ' వంటి ఘన విజయం అందించిన 'చందు మొండేటి..దర్శకత్వంలో
మళయాళ సీమలో పెద్ద విజయం సాధించిన 'ప్రేమంస రీమేక్ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప కలయికలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ . ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం' లో ఘన విజయం సాధించిన 'ప్ర్తేమం' చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు.
'ప్రేమం' ఓ స్వచ్చ మైన ప్రేమకధ. 'ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు 'అనుపమ పరమేశ్వరన్' కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉంది. మాతృకను మించి తెలుగు లో ఈ చిత్రం మంచి విజయం సాధించేలా దర్శకుడు 'చందు మొండేటి' రూప కల్పన చేస్తున్నారు అని ఆయన తెలిపారు.
దర్శకుడు 'చందు మొండేటి' మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య హీరోగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో ఆనందంగా ఉంది. 'ప్రేమం' చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.
ఈ చిత్రానికి సంగీతం; రాజేష్ మురుగేషన్, గోపిసుందర్; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశి స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments