Naga Chaitanya:మంచి మనసు చాటుకున్న చైతూ.. నెటిజన్ల ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని హీరో నాగచైతన్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్స్ చైల్డ్‌కేర్ సెంటర్‌లో సందడి చేశాడు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న పిల్లలతో ఆటలాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ సరదగా గడిపాడు. చిన్నారుల ముఖాల్లో నవ్వులు నింపారు. అనంతరం వారికి బహుమతులు అందజేసి వారి ముఖాల్లో నవ్వులు నింపాడు. తాజాగా వీటికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలతో సరదాగా గడిపి వారిలో ధైర్యం నింపారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది కస్టడీ సినిమాతో ముందుకొచ్చిన చైతూ ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్‌లో చేస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతూ జర్నలిస్టుగా కనిపించనున్నారు.
ఇదే కాకుండా చందు మొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో క్యూట్ హీరోయిన్ సాయి పల్లవి చైకు జంటగా నటిస్తుంది. ఉపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం చైతూ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments