చైతు బ‌రువు త‌గ్గాడు...

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియో బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ప్రేమ‌మ్‌. మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్‌కు ఇది రీమేక్‌. శృతిహాస‌న్‌,మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఈ సినిమా కోసం చైత‌న్య ఏడు కిలోల బ‌రువు త‌గ్గాడు. చిత్ర క‌థాంశంలో భాగంగా 16 ఏళ్ల పిల్లాడు పాత్ర‌లో న‌టించ‌డానికి, లుక్ కోసం చైత‌న్య బ‌రువు త‌గ్గాడు. ఇందుకోసం ఓట్ మీట్‌, స‌లాడ్స్ తో పాటు ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి లైట్ మీల్ తీసుకున్నార‌ట‌. ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.