'శైలజారెడ్డి అల్లుడు' కథ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. 'మహానుభావుడు' వంటి ఘనవిజయం తరువాత మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తుండగా... అను ఇమ్మాన్యుయేల్ చైతన్య జోడిగా, రమ్యకృష్ణ కూతురిగా నటించింది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే రివీల్ చేశారు. సాధారణంగా టైటిల్ చూసిన వాళ్ళందరూ ఇది అత్త అల్లుడు మధ్య చాలెంజింగ్‌గా సాగే కథ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి తల్లి, కూతురు మధ్య క్రియేట్ అయిన ఈగో సమస్యలే సినిమా ప్రధాన కథాంశంగా ఉంటుందట.
వీరి మధ్య హీరో ఎంటర్ అయ్యి ఆ ప్రాబ్లెమ్‌ను ఎలా ఫేస్ చేశాడనేది కథ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. ఆగస్ట్ 31న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com